కేరళలోని కొట్టాయమ్‌కు చెందిన వృద్ధదంపతులు థామస్, మరియమ్మలు కారొన నుంచి కోలుకున్న విషయం తెలిసిందే కదా! వాళ్లకు వైద్య సేవలు అందించిన రేష్మ మోహన్‌దాస్ అనే నర్స్‌కూ కరోనా సోకింది. కేరళలో ఆ వైరస్ బారిన పడ్డ తొలి హెల్త్ వర్కర్ రేష్మ. ఇప్పుడు శుభవార్త ఏంటంటే ఆమె కోలుకొని ఆరోగ్యవంతురాలై ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ అయింది. డాక్టర్లు, తోటి నర్సుల అభినందనల మధ్య ఆమె ఇంటికి బయలుదేరారు. ‘14 రోజుల క్వారంటైన్ తర్వాత రేష్మ తిరిగి విధులకు హాజరు కావచ్చు’ అని కేరళఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ చెప్పారు.