ఇంగ్లండ్‌కు చెందిన మాజీ దిగ్గజ బ్యాటర్ రాబిన్ స్మిత్ (62) ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లో సోమవారం నాడు ఆకస్మికంగా మరణించారు. ఫాస్ట్ బౌలింగ్‌ను అత్యంత సమర్థంగా, ధైర్యంగా ఎదుర్కొనే కొద్దిమంది ఇంగ్లండ్ ఆటగాళ్లలో ఆయన ఒకరిగా గుర్తింపు పొందారు. అభిమానులు అతడిని ముద్దుగా ‘ది జడ్జ్’ అని పిలుచుకుంటారు.
దక్షిణాఫ్రికాలో జన్మించిన రాబిన్ స్మిత్, ఇంగ్లండ్ తరఫున 62 టెస్టులు మరియు 71 వన్డే మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించారు. టెస్టుల్లో సగటుతో 9 సెంచరీలతో సహా పరుగులు చేశారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆయన మొత్తం కు పైగా పరుగులు సాధించారు. 1992 ప్రపంచకప్ ఫైనల్ చేరిన ఇంగ్లండ్ జట్టులో స్మిత్ కీలక సభ్యుడు.
స్మిత్ మరణ వార్తను ఆయన కుటుంబం ఒక ప్రకటనలో ధృవీకరించింది. తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని కోరింది. గతంలో ఆయన మానసిక రుగ్మతలు, మద్యపానం వంటి సమస్యలతో పోరాడినప్పటికీ, వాటి ఆధారంగా మరణానికి గల కారణాలపై ఊహాగానాలు చేయవద్దని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. స్మిత్ మృతి పట్ల ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ), హాంప్‌షైర్ కౌంటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.