రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘పెద్ది‘. గ్రామీణ నేపథ్యంలో స్పోర్డ్స్ బ్యాక్‌డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రకటనతోనే మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీ గ్లీంప్స్.. అందులో పెద్ద షాట్ మరింత బజ్ క్రియేట్ చేసింది. ఈ ఈ చిత్రం నుంచి అప్‌డేట్స్ కూడా హైప్ ఇస్తున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ఫస్ట్ సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చికిరి చికిరి అంటూ సాగే ఈ పాట యూట్యూబ్‌లో ఫుల్ ట్రెండ్ అవుతుంది.
చికిరితో సెన్సేషన్
నేషనల్ కాదు ఇంటర్నేషనల్ స్థాయిలో చికిరి పాట మారుమ్రోగుతుంది. యూట్యూబ్‌లో సుమారు 110 పైగా మిలియన్ల వ్యూస్ ని దాటేసింది. ఇప్పటికీ వ్యూస్ పెరుగుతూనే ఉన్నాయి. పెద్ది ఫస్ట్ సింగిల్ కి వచ్చిన రెస్పాన్స్‌తో మూవీ టీం అంత ఫుల్ జోష్‌లో ఉంది. అదే ఉత్సాహంతో మేకర్స్ షూటింగ్ చకచక ముందుకు తీసుకువెళుతున్నారు. ఇప్పటికే దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంది. నగర శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ సంబంధించి చిత్రీకరణకు ప్లాన్ చేస్తున్నారు. అక్కడ భారీ సెట్ వేసి యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌కి ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
చరణ్,శివన్న పై యాక్షన్
ఈ యాక్షన్ షెడ్యూల్ రామ్ చరణ్ మాత్రమే కాదు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా పాల్గొంటున్నారట. ఈ షెడ్యూల్‌కి సంబంధించి మరో సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ కూడా ఉంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ ప్రముఖ బాలీవుడ్ స్టంట్ మాస్టర్ ఆధ్వర్యంలో జరగనుందని సమాచారం. ఆయనే విక్కీ కౌశల్ తండ్రి శ్యామ్ కౌశల్. దంగల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి ఆయన స్టంట్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఇప్పుడు తెలుగులో పెద్ది సినిమాతో ఆయన ఎంట్రీ ఇవ్వబోతున్నారు. హై ఇంటెన్స్‌గా సాగే ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా ఉంటుందంట. ఇదే క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశమని తెలుస్తోంది. ఈ ఫైట్ సీక్వెన్స్ థియేటర్లలో ఫ్యాన్స్‌కు ఫీస్ట్‌లా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. హిందీలో దంగల్, క్రిష్, పీకే, క్రిష్3తో పాటు పలు సూపర్ హిట్ సినిమాలకు ఆయన స్టంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారాయన.
మార్చిలో రిలీజ్
హిందీలో టాప్ కొరియోగ్రాపర్‌గా కొనసాగుతోన్న షామ్ కౌశల్ పెద్దికి సినిమాకు పనిచేయనుండటంతో మూపై బజ్ మరింత రెట్టింపు అయ్యింది. కాగా ఉప్పెన తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని ఆయన తెరకెక్కిస్తున్న చిత్రమిది. గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రమిది. ఈసారి ఎలాగైన పాన్ ఇండియా హిట్ కొట్టాలని చరణ్, ఇండస్ట్రీ కావాలని మెగా ఫ్యాన్స్ అంత ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ ఆశలన్ని పెద్దిపైనే ఉన్నాయి. డెబ్యూ మూవీతోనే వందకోట్లు కొట్టిన బుచ్చిబాబుతో సినిమా చేస్తుండటంతో మెగా ఫ్యాన్స్ అంత మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా పెద్ది రామ్‌చరణ్ బర్త్‌డే సందర్భంగా 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సమర్పణలో వ్రద్ది సినిమాస్ బ్యానర్‌లో వెంకట సతీష్ కిలేరు పెద్దిని నిర్మిస్తున్నారు.