సెంటిమెంట్ ను వదిలి అద్భుతమైన టైటిల్ ఫిక్స్ చేసిన త్రివిక్రమ్..?

స్వయంవరం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి రచయితగా ఎంట్రీ ఇచ్చాడు త్రివిక్రమ్. మొదటి సినిమాతోనే తన రచనలో వైవిధ్యాన్ని చూపించాడు. త్రివిక్రమ్ రచయితగా విపరీతమైన పేరు సంపాదించుకున్నారు. కొన్ని సినిమాలు పేర్లు చెబితే వెంటనే త్రివిక్రమ్ గుర్తు రావడానికి కారణం అతని రైటింగ్ కి ఉన్న ఇంపాక్ట్. త్రివిక్రమ్ బెస్ట్ రైటింగ్ అంటే నువ్వు నాకు నచ్చావ్ అని చెప్పాలి. ఆ సినిమా ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఇప్పటికీ కూడా టీవీలో ఆ సినిమా వస్తే ఫ్యామిలీ అంతా హ్యాపీగా చూసుకుని నవ్వుకుంటారు.

 

ఒక చక్కని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాను వెంకటేష్ కోసం రాశాడు త్రివిక్రమ్. ఆ తర్వాత మల్లీశ్వరి అనే లవ్ స్టోరీ ని కూడా రాశాడు. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతంగా వర్కౌట్ అయింది. అయితే రచయితగా వీరి కాంబినేషన్ సక్సెస్ఫుల్. కానీ త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ ఇప్పటివరకు సినిమా చేయలేదు. ఎప్పటినుంచో వీరిద్దరూ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక కొన్ని రోజుల క్రితమే ఆ వార్తలు అన్నిటికీ చెక్ పెడుతూ అధికారికంగా ప్రకటించారు.

 

ఆ సెంటిమెంట్ వదిలేసారు

త్రివిక్రమ్ సినిమాలకు సంబంధించి టైటిల్స్ ఎక్కువగా అ అక్షరంతోనే మొదలవుతాయి. అతడు, అ ఆ, అరవింద సమేత వీర రాఘవ, అలవైకుంఠపురంలో ఈ సినిమాలన్నీ ఉదాహరణలుగా చెప్పొచ్చు. అయితే వెంకటేష్ తో చేయబోయే సినిమాకి కూడా అదే అక్షరంతో మొదలయ్యే టైటిల్ ఖరారు చేస్తారు అని అందరూ ఊహించారు. కొంతమంది ఆనంద నిలయం, ఆనందరావు అంటూ కొన్ని రకాల టైటిల్స్ కూడా చెప్పారు.

 

మొత్తానికి త్రివిక్రమ్ ఆ అక్షరం సెంటిమెంట్ వదిలేసి ఒక కొత్త టైటిల్ను ఈ సినిమా కోసం అనుకుంటున్నారు. ఈ సినిమాకి ‘బంధుమిత్రుల అభినందనలతో’ అనే టైటిల్ ఖరారు చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో దీనిని అధికారకంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.

 

ఆసక్తికరమైన టైటిల్

ఏదేమైనా త్రివిక్రమ్ టైటిల్ తోనే ఆ సినిమా పైన కొంతమేరకు ఆసక్తిని క్రియేట్ చేస్తాడు. గతంలో సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ త్రివిక్రమ్ గారు అరవింద సమేత వీర రాఘవ అని టైటిల్ అనౌన్స్ చేయగానే ఫీజులు ఎగిరిపోయాయి. అసలు టైటిల్ తోనే సినిమా మీద ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయగలిగారు అంటూ సందీప్ రెడ్డి వంగ మాట్లాడారు.

 

అయితే వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే కచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బహుశా అందుకేనేమో బంధుమిత్రుల అభినందనలతో అని ఒక క్లాస్ టైటిల్ను ఈ సినిమా కోసం కన్సిడర్. అయితే ఇందులో ఇంతవరకు వాస్తవం ఉంది అనేది అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఈ సినిమాను 2026 లో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *