‘ఎఫ్3’, ‘గుర్తుందా శీతాకాలం’, ‘మాస్ట్రో’, ‘సీటీమార్’.. ఈ నాలుగు చిత్రాలతో బిజీగా ఉన్నారు తమన్నా. లాక్‌డౌన్ అనంతరం షూటింగ్‌లతో మరింత బిజీ అయ్యారు. దాదాపు డిసెంబర్ వరకూ ఆమె కాల్షీట్లు నిండిపోయాయి. తాజాగా నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ‘మాస్ట్రో’ చిత్రం చివరి షెడ్యూల్ చేస్తున్నారు తమన్నా. రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. అయితే ప్రస్తుతం తమన్నా, నితిన్‌పై ఓ ప్రమోషనల్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. రెండు రోజుల్లో ఈ పాట చిత్రీకరణ పూర్తి చేసుకుని ‘గుర్తుందా శీతాకాలం’ షూటింగ్ కోసం బెంగుళూరు పయనం కానున్నారు మిల్కీబ్యూటీ.