పెట్రోల్ బాదుడు ఇంకా తగ్గలేదు. ఒకటి, రెండు సార్లు మినహా రెండు నెలలుగా వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో ఇవాళ కూడా పెరిగాయి. ప్రాంతాల వారీగా లీటర్ పెట్రోల్ పై 30 నుంచి 60 పైసలు, డీజిల్‌పై 20 పైసలు వరకూ పెరిగింది.
దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ రూ. 101,84, లీటర్ డీజిల్ రూ. 87,97, ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 107,83 లీటర్ డీజిల్ రూ. 97,45, హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 105,83, లీటర్ డీజిల్ రూ. 97,96, జైపూర్‌లో లీటర్ పెట్రోల్ రూ. 108,71, డీజిల్ రూ. 99,02గా ఉంది.