టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel)దర్శకత్వంలో భారీ యాక్షన్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇతర భాష సెలబ్రిటీలు కూడా ఈ సినిమాలో భాగమవుతున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ లొకేషన్లోకి బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో అనిల్ కపూర్ (Anil Kapoor)ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో అనిల్ కపూర్ కీలక పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం.
డ్రాగన్ సినిమాలో అనిల్ కపూర్..
అందుతున్న సమాచారం ప్రకారం అనిల్ కపూర్ ఎన్టీఆర్ కు విలన్ గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమాలో అనిల్ కపూర్ పాత్ర ఏంటి అనే విషయాలు తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)నటించబోతున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా డ్రాగన్ అనే పేరుతో షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా డ్రాగన్ కాదా?
ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేయలేదని ఈ సినిమాకు మరొక టైటిల్ ఉందని త్వరలోనే ఈ టైటిల్ కూడా వెల్లడించబోతున్నామని మైత్రి నిర్మాతలలో ఒకరైన రవి ఇటీవల వెల్లడించారు. గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసి ఈ సినిమా టైటిల్ ప్రకటించబోతున్నట్లు రవి వెల్లడించారు. ఎన్టీఆర్ ఇటీవల నటించిన వార్ 2 సినిమా ద్వారా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు. ఈ సినిమా అనంతరం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తారక్ బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటూ కూడా వార్తలు వచ్చాయి మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.
యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా..
ప్రశాంత్ నీల్ కే జి ఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా అనంతరం ప్రభాస్ తో కలిసి సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ అందుకున్నారు.ఇక తాజాగా ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమా చేయబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.అతిపెద్ద యాక్షన్ అడ్వెంచర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే ఈ చిత్రాన్ని 2027వ సంవత్సరంలో విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ పనులలో చిత్ర బృందం బిజీగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ సైతం RRR సినిమా ద్వారా గ్లోబల్ స్థాయిలో హీరోగా మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా అనంతరం దేవరతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సక్సెస్ అందుకున్నారు.