గోవా ఇఫీలో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ శకటం

గోవాలో నవంబర్ 20 నుంచి 28 వరకు జరుగుతున్న 56వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (IFFI) 2025 ప్రారంభోత్సవ పెరేడ్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక ప్రత్యేక శకటం (Tableau) ప్రదర్శితమైంది. “ది హీయర్ బీట్ ఆఫ్ ఇండియన్ సినిమా అండ్ టూరిజమ్” అనే థీమ్‌తో ప్రదర్శించిన ఈ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APTFDCA) 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, మొట్టమొదటిసారిగా ఈ శకటాన్ని ప్రదర్శించారు.

ఏపీ పర్యాటక ప్రాంతాల ప్రదర్శన

ఈ శకటంలో రాష్ట్రంలోని ప్రసిద్ధ సినిమా షూటింగ్ లోకేషన్లు, పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన ఛాయా చిత్రాలను కనువిందు చేశారు. ప్రదర్శించిన ప్రాంతాలలో కొన్ని:

  • గండికోట

  • అరకు లోయ, బొర్రా గుహలు

  • పాపికొండలు

  • లేపాక్షి నంది

  • అమరావతి (క్యాపిటల్ సిటీ)

  • ఎర్రమట్టి దిబ్బలు

ఈ శకటంలో 20 మంది డూప్ లైవ్ నటీనటులు పాల్గొని చిత్రోత్సవాల పెరేడ్‌లో సందడి చేశారు.

 హాజరైన ప్రముఖులు

భారత ప్రభుత్వ ప్రసార మంత్రిత్వ శాఖ సెక్రటరీ సంజయ్ జాజు ఆహ్వానం మేరకు APTFDCA ఈ పెరేడ్‌లో పాల్గొంది. ఈ చలన చిత్రోత్సవ వేడుకలకు తెలుగు సినిమా కథానాయకుడు, శాసనసభ్యులు, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ, నటి శ్రీలేఖ హాజరయ్యారు. వీరితో పాటు గోవా రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు మరియు జాతీయస్థాయి నటీనటులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ శకటంతో పాటు కర్ణాటక, గోవా, నేషనల్ ఫిలిమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు చెందిన శకటాలు కూడా ప్రదర్శనలో పాల్గొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *