హైదరాబాద్ : దేశవ్యాప్తంగా కరోనా ఉదృతి కొనసాగుతున్న వేల , లాక్ డౌన్ కొనసాగుతున్న కరోనా కేసులు తగ్గట్లే , ఈ సమయంలో పారిశుధ్య సంరక్షం ముఖ్యమే , ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం ముఖ్య కార్యాచరణలో పారిశుధ్య కార్మికులకు కొన్ని సదుపాయాలు కలిగించి అండగా ఉంటామని పేర్కొంది . దేశ రక్షణలో భాగంగా సైనికుడు ప్రాణాలకు తెగించి సరిహద్దుల్లో కాపలా కాస్తుంటే.. వీధుల్లోని చెత్తా చెదారాన్ని ఊడ్చి పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజలు కరోనా బారిన పడకుండా తమవంతు సేవలు అందిస్తున్నారు మన సఫాయీ కార్మికులు. జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ, కరోనా నివారణలో సిపాయీల వలే పోరాడుతున్నారు. తమను తాము రక్షించుకుంటూ.. నగరాన్ని రక్షిస్తున్నారు. తమ కుటుంబాలకూ ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. ఎవరు కాదంటున్నా.. తాము పొరకపట్టకుంటే నగరం చెత్తా చెదారాలతో అధ్వానంగా మారి రోగాన్ని పెంచే ప్రమాదముందంటూ సూరీడుతో పోటీపడుతూ పనులు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ యంత్రాంగం సైతం వారికి అవసరమైన మాస్కులు, చేతులకు గ్లవుజులతో పాటు, సబ్బులు,కొబ్బరి నూనె తదితరాలను అందజేస్తోంది. ఆరోగ్య బీమా సదుపాయం కల్పించడంతో పాటు ప్రతి 3 నెలలకోసారి వైద్య పరీక్షలు చేస్తోంది. నగర ఆరోగ్యం బాగుండాలంటే పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం బాగుండాలనే ప్రధాన ఉద్దేశంతో జీహెచ్‌ఎంసీ ఆయా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇలా.. ఇటు అధికారులు, అటు కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్లే జీహెచ్‌ఎంసీలోని పారిశుద్ధ్య కార్మికులు ఇతర నగరాలకు ఆదర్శప్రాయంగా మారారు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఇప్పటికే 39 మంది పారిశుద్ధ్య కార్మికులు కరోనాతో ఆస్పత్రుల్లో చేరారు.