విడాకుల తర్వాత హార్దిక్ పాండ్యా: మహియెకా శర్మతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు వైరల్

టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత మరోసారి వార్త‌ల్లో నిలిచారు. కొంతకాలంగా నటి, మోడల్ మహియెకా శర్మతో హార్దిక్ డేటింగ్‌లో ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్న వేళ, స్టార్‌ క్రికెటర్‌ తాజాగా మహియెకాతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను తన సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి, ఈ పోస్ట్‌తో డేటింగ్ రూమర్స్‌కు మరింత బలం చేకూరినట్లయింది.

హార్దిక్ పాండ్యా తన కుమారుడు అగస్త్య మరియు మహియెకాతో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అందులో ఓ వీడియోలో హార్దిక్ మరియు మహియెకా సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. ఈ వీడియోలో హార్దిక్‌ తన ప్రియురాలి బుగ్గపై ముద్దు పెడుతూ ఎంతో సంతోషంగా కనిపించడం ఈ ఫొటోలు దివాళీ వేడుకలవిగా తెలుస్తోంది. మరో ఫొటోలో జిమ్‌లో మహియెకాను ఎత్తుకుని చిరునవ్వులు చిందిస్తూ హార్దిక్‌ ఫోటోకు ఫోజులిచ్చాడు. ఈ ఫొటోలు ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

నటాషాతో విడిపోయిన తర్వాత హార్దిక్ బ్రిటీష్ సింగర్ జాస్మిన్ వాలియాతో కూడా కొద్ది రోజులు డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు వచ్చాయి. అయితే, మహియెకా శర్మతో డేటింగ్ రూమ‌ర్స్ మొదటగా ‘రెడిట్’ అనే సోష‌ల్ మీడియా ద్వారా ప్రారంభమయ్యాయి. మహియెకా షేర్ చేసిన సెల్ఫీ బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించిన వ్యక్తి హార్దిక్ పాండ్యానే అని నెటిజ‌న్లు గుర్తించడం ఈ వార్తలకు మూలం. ఈ నేపథ్యంలో హార్దిక్ స్వయంగా ఫొటోలు పోస్ట్ చేయడం ఈ వార్తలకు మరింత స్పష్టతనిచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *