పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలు: సచిన్ టెండూల్కర్ భావోద్వేగ ప్రసంగం

శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు పుట్టపర్తిలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు క్రికెటర్ సచిన్ టెండూల్కర్, సినీ నటి ఐశ్వర్యరాయ్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ప్రధాని మోదీ శ్రీసత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, రైతులకు అందించే గోదాన కార్యక్రమంలో భాగంగా నలుగురు రైతులకు గోవులను దానం చేశారు. ఆ తర్వాత, ప్రధాని మోదీ సాయి కుల్వంత్‌ సభా మందిరంలో వేద పండితుల నుంచి వేదాశీర్వచనం అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పుట్టపర్తి అనేది లక్షల మందికి స్పూర్తినిచ్చే ప్రాంతమని అన్నారు. సత్యసాయి నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని గుర్తు చేసుకున్న సచిన్, చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. “చిన్నప్పుడు నా హెయిర్‌స్టైల్ చూసి నన్ను చిన్న సత్యసాయి అనేవారు” అని ఆయన చిలిపిగా నవ్వుకున్నారు. 1997 నుంచి సత్యసాయి బాబాతో తనకు అనుబంధం ఉందని, ఎన్నోసార్లు పుట్టపర్తికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్నానని చెప్పారు. కన్ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు బాబా తనకు సరైన మార్గం చూపారని సచిన్ తెలిపారు.

సత్యసాయి బాబా బోధనల్లో ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావిస్తూ, “ఎదుటివారిని ఎప్పుడూ జడ్జ్ చేయొద్దు, వీలైనంత మేరకు అర్థం చేసుకోవాలి” అని బాబా చెప్పేవారని సచిన్ గుర్తు చేసుకున్నారు. తన జీవితంలో అత్యంత కీలకమైన సందర్భాన్ని ప్రస్తావిస్తూ, 2011లో తాను చివరి వరల్డ్ కప్‌ ఆడే సమయంలో బాబా తనకు ఫోన్‌ చేసి ధైర్యం చెప్పారని సచిన్ టెండూల్కర్ భావోద్వేగానికి లోనయ్యారు. అటు, సినీ నటి ఐశ్వర్యరాయ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, మానవసేవే మాధవ సేవ అని సత్యసాయి చెప్పిన మాటలను, ఆయన సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *