బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా వి.వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ షూటింగ్ శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కు రాజమౌళి క్లాప్ కొట్టారు. ఆయన సతీమణి రమా రాజమౌళి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. కె.వి విజయేంద్ర ప్రసాద్ స్ర్కిప్ట్ అందజేశారు. నిర్మాత ఎం.ఎం. రత్నం గౌరవ దర్శకత్వం వహించారు. పెన్ స్టూడియోస్ బేనర్‌లో ధవల్ జయంతిలాల్ గడ నిర్మిస్తున్నారు.
”బెల్లంకొండ సాయి శ్రీనివాస్, వినాయక్ కాంబినేషన్‌లో భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇది ఇండియన్ సినిమాలో హిస్టరీని క్రియేట్ చేసే కాంబినేషన్ అవుతుంది” అని నిర్మాత అన్నారు. మాతృకకు కథను అందించిన కె.వి విజయేంద్రప్రసాద్ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌కు కథను అందిస్తున్నారు. త్వరలోనే నటీనటుల వివరాలను వెల్లడించనున్నారు. తనిష్క బాచీ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: నిజర్ అలీ షఫీ.