వకీల్ సాబ్ సినిమా రీ ఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న సినిమాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ చేశారు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా మాత్రం ఇంకా పూర్తిగా లేదు. కానీ ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది .
10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ కి చెప్పుకోదగ్గ హిట్ సినిమా లేదు అనుకుంటున్నా తరుణంలో హరీష్ శంకర్ చేసిన ఈ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ నమోదు చేసుకుంది. ఒక రీమేక్ సినిమాతో కూడా రికార్డ్స్ క్రియేట్ చేయొచ్చు అని ప్రూవ్ చేసింది. పవన్ కళ్యాణ్ స్టామినా ఇది అని కలెక్షన్స్ మాట్లాడాయి. ఇప్పుడు వీరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు ఉండటం సహజం. ఇది కాకుండా స్వతహాగా హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అవడం కూడా ఒక కారణం.
అయితే ఈ సినిమా 2026 మే నెలలో విడుదలవుతుంది అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీని గురించి అధికారక ప్రకటన రాలేదు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ త్వరలో రిలీజ్ అవుతుంది అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏకంగా దాని గురించి హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చేశారు.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ డిసెంబర్ నెలలో విడుదల కాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు హరీష్. రీసెంట్గా అల్లరి నరేష్ నటించిన రైల్వే కాలనీ సినిమా ఈవెంట్ కు హాజరయ్యాడు హరీష్. ఈవెంట్లో నటుడు జీవన్ రెడ్డి హరీష్ ను అప్డేట్ అడిగారు.
నెక్స్ట్ మంత్ ఉండబోతుంది అని చెప్పాడు హరీష్. అయితే డిసెంబర్ 31 మేము చాలా బిజీగా ఉంటాం. ఎప్పుడు ఇస్తారు డేట్ చెప్పండి అంటే. అప్పటికే వచ్చేస్తుంది అంటూ చెప్పారు. అంటే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ డిసెంబర్ 31ని రిలీజ్ కాబోతున్నట్లు అధికారికంగానే అప్డేట్ ఇచ్చేసాడు హరీష్.
అజ్ఞాతవాసి రిపీట్
గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలైంది. కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని సక్సెస్ సాధించలేకపోయింది. డిసెంబర్ 31 కానుకగా పవన్ కళ్యాణ్ పాడిన అజ్ఞాతవాసి సినిమాలోని కొడకా కోటేశ్వరరావు అనే పాటను విడుదల చేశారు.
ఆ పాటను చాలామంది అభిమానులు ఎంజాయ్ చేశారు. సినిమా ఫలితం పక్కన పెట్టేస్తే, అక్కడ వరకు ప్రేక్షకులు హ్యాపీ. ఇప్పుడు అదే డేటు న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి సాంగ్ రిలీజ్ అవుతుంది అంటే పవన్ అభిమానులకు ఇప్పటికే క్యూరియాసిటీ మొదలైపోయింది. అయితే హరీష్ మీద మాత్రం బలమైన నమ్మకం ఉంది. ఇక సాంగ్ వచ్చిన తర్వాత వైబ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థమవుతుంది.