వారి హెల్ప్ తోనే ఐబొమ్మ రవి ఇలా చేశాడు..? వెలుగులోకి సంచనల నిజాలు..!

ఐబొమ్మ రవి ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా రవి థియేటర్లోకి విడుదలైన సినిమాలను వెంటనే పైరసీ చేస్తూ కోట్లు రూపాయలను సంపాదించారు. ఈ క్రమంలోనే పైరసీని అడ్డుకోవడానికి పోలీసులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే రవిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇలా రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈయనని విచారించి తన నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. తాజాగా రవికి సంబంధించిన మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.

 

కరేబియన్ పౌరసత్వాన్ని పొందిన రవి..

రవి వైజాగ్ కు చెందిన వ్యక్తి అయినప్పటికీ సినిమాలను పైరసీ చేస్తూ ఈయన గత కొంతకాలంగా విదేశాలలోనే నివసిస్తున్న సంగతి తెలిసింది. అయితే 2022వ సంవత్సరంలోనే రవి భారతదేశ పౌరసత్వాన్ని వదులుకున్నట్టు తెలుస్తోంది. ఇలా భారతదేశ పౌరసత్వాన్ని వదులుకున్న ఈయన 2022లోనే కరేబియన్ పౌరసత్వాన్ని(Caribbean Citizenship) కూడా తీసుకున్నారు. ఈ పౌరసత్వం పొందడం కోసం సుమారు 80 లక్షల రూపాయలు చెల్లించారని తెలుస్తోంది. ఇలా కరేబియన్ పౌరసత్వం పొందిన రవి 2022 నుంచి కరేబియన్ దీవులలోనే నివసిస్తున్నారు. ఇక భారత దేశ పౌరసత్వాన్ని వదులుకున్న ఈయన గత మూడు రోజుల క్రితం ఇండియాలోకి అడుగు పెట్టారు.

 

ఇండియాలో ఆస్తులు అమ్మడం కోసమే..

ఇలా ఇండియాకు రావడానికి కారణం లేకపోలేదు ఇండియాలో ఉన్న తన ఆస్తులు అన్నింటిని అమ్ముకొని విదేశాలలోనే స్థిరపడాలనే ఆలోచనలో రవి ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే హైదరాబాద్ వైజాగ్ లో ఉన్న తన ఆస్తులను అమ్మేయాలని ఇండియాలోకి అడుగు పెట్టారు.. విదేశాల నుంచే ఈయన ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సమస్థతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. కరేబియన్ దీవులలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న ఈయన శాశ్వతంగా ఇండియాకు దూరం అవ్వాలని ఇక్కడికి వచ్చి పోలీసులకు దొరికిపోయారు.

 

మూవీ రూల్జ్ కంటెంట్..

 

2022 కు ముందు ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్న రవి ఆమె నుంచి కూడా విడాకులు తీసుకన్నారు. టెక్నాలజీ పరంగా మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి కావడంతో ఐ బొమ్మను క్రియేట్ చేశారు. ఓటీటీ కంటెంట్ ను డిఆర్ఎం టెక్నాలజీ ద్వారా హ్యాక్ చేస్తూ అప్లోడ్ చేసేవారు. అలాగే మూవీ రూల్జ్ ద్వారా కంటెంట్ తీసుకొని ఆ కంటెంట్ ను హెచ్డీలోకి మారుస్తూ ఈయన పైరసీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. సుమారు 60 వెబ్సైట్లను క్రియేట్ చేసి పైరసీ కంటెంట్ పోస్ట్ చేస్తూ ఇప్పటివరకు కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించినట్టు పోలీసుల విచారణలో బయటపడ్డాయి. దర్శక నిర్మాతలు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన సినిమాలను పైరసీ చేస్తూ రవి కూడా వందల కోట్లు సంపాదించారనే విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *