టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో కొంతమంది నిందితులను సిట్ అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డిని ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించారు.
అయితే వైవీ సుబ్బారెడ్డి అతని పదవి కాలంలోనే అనుభవం లేని డెయిరీలకు ఆర్డర్లు ఇచ్చి, కల్తీ నెయ్యి సరఫరా అనుమతించినట్లు SIT నిర్ధారించింది. 2022 మే 25న భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు సుబ్బారెడ్డిని హైదరాబాద్‌లో కలిసి, కేజీ నెయ్యికి రూ.25 లబ్ధి, తనిఖీలు ఆపమని కోరారు. కల్తీ తేలినా, సరఫరాదారులపై చర్యలు సిఫార్సు చేయకపోవడం అనుమానాస్పదం.
అయితే సుబ్బారెడ్డి పీఏ చిన అప్పన్న ఖాతాలో 4.69 కోట్లు, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ నుంచి రూ.50 లక్షల ముడుపులు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. దిల్లీలో అమన్ గుప్త నుంచి రూ.20 లక్షలు, విజయ్ గుప్త నుంచి రూ.30 లక్షలు చిన అప్పన్నకు వచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి. సుబ్బారెడ్డి, అతని సతీమణి యర్రం స్వర్ణలతారెడ్డి బ్యాంక్ లావాదేవీలు SIT స్కానర్‌లో ఉన్నాయి.
అతను ఈ నెల 13న విచారణకు రావాలని సుబ్బారెడ్డికి నోటీసులు ఇవ్వగా.. అనారోగ్య కారణాల రీత్యా తాను విచారణకు రాలేనని సుబ్బారెడ్డి సమాధానమిచ్చారు. దీంతో ఈ నెల 20న హైదరాబాద్‌లోని సుబ్బారెడ్డి నివాసంలో విచారణ చేస్తామని సిట్ అధికారులు తెలిపారు. వైవీ సుబ్బారెడ్డి చెప్పే విషయాలు కల్తీ లడ్డూ కేసుకు కీలకంగా మారనున్నాయి. ఈ నెల 20న హైదరాబాద్‌లో విచారణ జరగనుంది.