బీసీలకు సంపూర్ణ న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ- న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్

హైదరాబాద్, గాంధీభవన్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాల లో ఘనవిజయం సాధించిన బీసీ బిడ్డ నవీన్ యాదవ్ గారికి హృదయపూర్వక అభినందలు తెలిపిన న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప( బై )ఎన్నికల్లో బీసీలకు చట్టసభల్లో పంపించాలనే ఆకాంక్షతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నవీన్ యాదవ్ గారిని బరిలో దింపి జూబ్లీహిల్స్ ఓటర్ మహాశయులకు కాంగ్రెస్ పార్టీ ప్రాముఖ్యత గురించి తెలియజేసి కాంగ్రెస్ పార్టీ మంత్రులను, ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు పనిచేసేలా కట్టుదిట్టంగా ఏర్పాటు చేసి నవీన్ యాదవ్ గారిని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా విజయం కైవసం చేసుకోవడం ఎంతో ఆనందదాయకం అని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సమక్షంలో తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో టిపిసిసి సీనియర్ నాయకులు ఇంచార్జ్ ఉపాధ్యక్షులు కుమార్ రావు గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దయానంద్ గారు, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ మహిళ కార్యకర్తలు, సంగారెడ్డి బీసీ సంఘం నాయకులు జి శంకర్ గౌడ్, హ్యూమన్ రైట్స్ సదాశివపేట డైరెక్టర్ రుద్ర శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *