ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ – APSSDC నుంచి మరో భారీ ఉద్యోగ ప్రకటన విడుదలైంది. మొత్తం 500 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ప్రముఖ KL Groupకు చెందిన KL Technical Servicesలో ఖాళీల భర్తీకి ఈ ప్రకటన విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థుల నుంచి సంస్థ ఎంపికలు నిర్వహిస్తుంది. ఎంపికైన అభ్యర్థులు Amazon Warehouse (KL Technical Servises, Villa no.39, Behind Shamshabad mandal office, Shamshabad – Hyderabad)లో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను ప్రకటనలో చూడొచ్చు. మొత్తం 500 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అసోసియేట్(కాంట్రాక్ట్ రోల్) విభాగంలో ఈ నియామకాలు చేపట్టారు. ఇంటర్ / డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ అయిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 13,500 నుంచి రూ.15 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. వేతనంతో పాటు ఇతర చట్టబద్ధమైన బెనిఫిట్స్ అందిస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యర్థుల వయస్సు 20-30 ఏళ్లు ఉండాలి. పురుషులు లేదా స్త్రీలు ఎవరైనా ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.