రాయచోటి అభివృద్ధి చరిత్రలో స్వర్ణాక్షరాలు రాసిన గడికోట శ్రీకాంత్ రెడ్డి..

*రాయచోటి అభివృద్ధి చరిత్రలో స్వర్ణాక్షరాలు రాసిన గడికోట శ్రీకాంత్ రెడ్డి…*

*అభివృద్ధి అంటే మాటలకాదు… చేతల్లో చూపించిన నాయకుడు శ్రీకాంత్ రెడ్డి*

*రాయచోటి అభివృద్ధి అనే పదం వినిపించినప్పుడు గుర్తుకు వచ్చే పేరు — గడికోట శ్రీకాంత్ రెడ్డి*
*మీడియా సమావేశంలో సిబ్యాల విజయ భాస్కర్*
రాయచోటి :
రాయచోటి పట్టణం ఈరోజు చూస్తున్న రూపు, రోడ్లు, కార్యాలయాలు, ప్రజాసదుపాయాల వెనుక ఉన్న పేరు గడికోట శ్రీకాంత్ రెడ్డి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి సిబ్యాల విజయ భాస్కర్ స్పష్టం చేశారు.
అభివృద్ధి గురించి మాట్లాడే వాళ్లు చాలామంది ఉంటారు… కానీ అభివృద్ధిని చేతల్లో చూపించిన నాయకుడు శ్రీకాంత్ రెడ్డి గారే అన్నారు.

*రాయచోటి అభివృద్ధి శ్రీకాంత్ రెడ్డి హయాం లోనే..ప్రజల జీవితాలను మార్చిన అభివృద్ధి జాబితా…*
రూ.2.50 కోట్లతో ఆర్టిసి బస్టాండ్ విస్తరణ, రూ.23 కోట్లతో వంద పడకల ఆసుపత్రి అభివృద్ధి పనులు, రూ.1.33 కోట్ల నిధులతో ట్రాఫిక్ పోలీసు స్టేషన్ భవన నిర్మాణాలు, రూ 2.30 కోట్ల నిధులుతో టిటిడి కల్యాణ మండపం, రూ.1కోటి నిధులుతో వైఎస్ఆర్ రైతు బజార్, రూ 1.08 కోట్ల నిధులుతో రాయచోటి ఎంపిడిఓ కార్యాలయ భవనాలు, స్టేట్ గెస్ట్ హౌస్, రూ 98 లక్షలుతో డి.ఎస్పీ కార్యాలయం, రూ.2.40 కోట్లతో మున్సిపల్ సభాభావనం, 4 పట్టణ ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణాలు, పట్టణంలో రహదారుల విస్తరణ, డైట్ హాస్టల్ ప్రాంగణంలో రూ 73 లక్షల నిదులుతో మున్సిపల్ పార్క్ నిర్మాణపు పనులు తదితర అభివృద్ధి పనులు, అదనపు త్రాగునీటి పథకాలు ఏర్పాటు, మున్సిపాలిటీని గ్రేడ్ 1 నుంచి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేయించడం జరిగిందన్నారు. రూ 16 కోట్లతో పట్టణంలోని ఠాణా నుంచి చెన్నముక్కపల్లె వరకు రహదారి విస్తరణ సుందరీకరణ ,రూ 4.15 కోట్లతో ఎస్ ఎన్ కాలనీ నుంచి గుణ్ణికుంట్ల రింగ్ రోడ్డు వరకు రహదారి సుందరీకరణ పనులను,కోట్లాది రూపాయల వ్యయంతో పట్టణంలో రహదారుల నిర్మాణాలకు శ్రీకాంత్ రెడ్డి చేసిన కృషి ఆమోఘమన్నారు. కలెక్టరేట్ కు ఎదురుగా 102 అడుగుల జాతీయ జెండా, పట్టణంలోని నాలుగు వరుసల జాతీయ రహదారిలో మహాత్మాగాంధీ, డా బి ఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, అబ్దుల్ కలాం జాతీయ నాయకుల విగ్రహాల ఏర్పాటు, నాలుగు వరుసల జాతీయ రహదారిపై ఎల్ఈడి స్ట్రీట్ లైట్ల ఏర్పాటుతో పట్టణానికి నూతన శోభను తేవడంలో శ్రీకాంత్ రెడ్డి కృషి ఎనలేనిదని చెప్పవచ్చునన్నారు. క్రికెట్ స్టేడియం, నగరవనం ల పనులు దాదాపు పూర్తయ్యాయన్నారు. శిల్పారామం పనులను శ్రీకాంత్ రెడ్డి మంజూరు చేయించి ప్రారంబింప చేశారన్నారు. పేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు రాయచోటి నియోజక వర్గ వ్యాప్తంగా 20 వేలకు పైగా పక్కా గృహాలు మంజూరు, 95 జగనన్న కాలనీలను మంజూరు చేయించడం, పట్టణ ప్రజల కోసం నారాయణరెడ్డిగారిపల్లె జగనన్న కాలనీలో 6 వేలకు పైగా పక్కా గృహాల మంజూరుతో పాటు కోట్లాది రూపాయలతో మౌలిక వసతుల కల్పనలో శ్రీకాంత్ రెడ్డి కృషిని ప్రజలు మరువలేకున్నారన్నారు.

*జిల్లా కేంద్ర స్థాయికి చేరిన పట్టణం — ప్రజల గర్వకారణం*
వంద ఏళ్లకు కూడా రాయచోటి జిల్లా కేంద్రం అవుతుందో లేదోనన్న పరిస్థితులుండే నేపధ్యంలో అప్పటి ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి కృషితో జిల్లా ఏర్పాటు అయిందన్నారు. జిల్లా కేంద్రమైన రాయచోటి అభివృద్ధిలో ఎటువంటి రాగద్వేషాలకు లోను కాకుండా అభివృద్దే ధ్యేయంగా పనిచేసిన ఘనతను శ్రీకాంత్ రెడ్డి దక్కించుకున్నారన్నారు.భూ అక్రమణలు, అవినీతి, రౌడీ యిజానికి తావులేకుండా ప్రశాంతమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేసారన్నారు. అభివృద్ధి అనేది నేటి కోసం కాకుండా రేపటి తరాలకు కూడా మంచి ఫలాలను అందివ్వాలన్న ధ్యేయంగా శ్రీకాంత్ రెడ్డి పని చేశారన్నారు.జిల్లా కేంద్రం అయినప్పుడు నుంచి రాయచోటి పట్టణం నలువైపులా శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, మార్కెటింగ్, హోటళ్లు, వివిధ వ్యాపారాలు, రవాణా పెరగడం, పలు షాపింగ్ మాల్స్ ఏర్పాటు తో యువతకు ఉపాధి అవకాశాలు కలుగుచున్నాయంటే ఇందుకు శ్రీకాంత్ రెడ్డి కృషి ఎంతో ఉందని ప్రజలు గుర్తుకు చేసుకుంటున్నారన్నారు

*రాయచోటిని విద్యా హబ్ గా తీర్చిదిద్దిన ఘనత శ్రీకాంత్ రెడ్డిదే..*
రాయచోటి నియోజకవర్గ పరిధిలో 6 కస్తూర్భా పాఠశాలలు,5 మోడల్ స్కూల్స్ లలో వేల మందికి ఉచితంగా విద్య అందుతోందంటే అప్పటి ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి ముందుచూపే. రాయచోటి పట్టణంలో పాలిటెక్నిక్ కళాశాల,మహిళా డిగ్రీ కళాశాలలను శ్రీకాంత్ రెడ్డి మంజూరు చేయించారు. రాయచోటి పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్ లో ఆడపిల్లలకు 3 వ తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యాసంస్థలును ఒకే ప్రాంగణంలో ఉండేలా శ్రీకాంత్ రెడ్డి చేసిన కృషి ఎనలేనిది.పిజి కేంద్రం ఆపై యూనివర్సిటీ ఏర్పాటుకొరకు 80 ఎకరాల ప్రభుత్వ భూములను, కేంద్రీయ విద్యాలయనికి 5 ఎకరాల భూములను సేకరింపచేశారు. రాయచోటిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అదనపు కోర్సులు, మౌలిక వసతులు కల్పించి బలోపేతం చేసిన ఘనత ఆయనకు దక్కుతుంది.రాయచోటిని విద్యాహబ్ గా తీర్చిదిద్దడంలో మాజీ ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి కృషి ఎనలేనిదన్నారు.

*కూటమి నేతల విమర్శలకు ప్రజల సమాధానం – అభివృద్ధే సాక్ష్యం*
కూటమి నేతలు రాయచోటిలో అభివృద్ధి జరగలేదని విమర్శించడం ప్రజల ఆలోచనలకు విరుద్ధమని సిబ్యాల విజయభాస్కర్ పేర్కొన్నారు.రాయచోటి వీధుల్లో తిరిగితేనే అభివృద్ధి ఎలా జరిగిందో తెలుస్తుందని,మాటలతో కాదు, పనులతో మాట్లాడిన నాయకుడు శ్రీకాంత్ రెడ్డి గారు అని గట్టిగా హెచ్చరించారు.

*భవిష్యత్ దిశ — రాయచోటి ప్రజల ఆకాంక్ష*
గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు రాయచోటికి మరింత అభివృద్ధి పనులు తీసుకువచ్చి, జిల్లా కేంద్రంగా నిలబెట్టి,రాయచోటి బిడ్డగా ప్రజల రుణం తీర్చుకోవాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శివయ్య. రాష్ట్ర రెడ్డి యూనియన్ కార్యదర్శి రేపల్లె సంజీవయ్య. వైఎస్ఆర్సిపి నాయకులు శివశంకర్ యాదవ్. పలువురు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *