వస్తు సేవల పన్ను “Goods and service tax” (జీఎస్‌టీ) రూ.75,000 కోట్లను ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసింది. ఈ మేరకు అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా దీనికి సంబందించిన వివరాలను తెలిపింది. లగ్జరీ, ఆల్కహాల్, పొగాకు వంటి సిన్ గూడ్స్ నుంచి వసూలు చేసే సెస్ నుంచి ప్రతి రెండు నెలలకు ఒకసారి విడుదల చేసే జీఎస్‌టీ పరిహారానికి ఇది అదనమని వివరించింది.
కాగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు జీఎస్‌టీ విడుదల చేయాలనీ మే 28వ తేదీన జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా జీఎస్‌టీ పరిహారం విడుదల చేసింది. ఇక రాష్ట్రాలకు జీఎస్‌టీ పరిహారం రూ.2.59 లక్షల కోట్లుగా ఉంటుందని కేంద్రం అంచనా వేసింది.
ఈ నేపథ్యంలోనే రూ.1.59 లక్షల కోట్ల బదలాయింపుల్లో దాదాపు సగం మొత్తాన్ని ఒకే ఇన్‌స్టాల్‌మెంట్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విడుదల చేసింది. కాగా జీఎస్‌టీ అమలు వల్ల రాష్ట్రాలు, కేంద్రం పాలిత ప్రాంతాలు కోల్పోయే ఆదాయాలను కేంద్రం భర్తీ చేయాలన్న నిబంధన ఉంది. ఇక ఆర్ధిక ఇబ్బందులో ఉన్న రాష్ట్రాలకు ఇది ఊరటనిచ్చే అనే విషయమే అని చెప్పుకోవచ్చు.