దేశంలో ఎగుమతులు మళ్లీ పుంజుకున్నాయి. ఏడు నెలలుగా వరుస పురోగతి

దేశంలో ఎగుమతులు మళ్లీ పుంజుకున్నాయి. ఏడు నెలలుగా వరుస పురోగతిని కొనసాగిస్తూ, జూన్ నెలలో 48.34 శాతం పెరిగి 32.52 బిలియన్ డాలర్లకు చేరాయి. జూన్ నెలలో దిగుమతులు 98 శాతం పెరిగి.. 41.87 డాలర్లకు చేరాయి. జూన్ నెలలో ఎగుమతులు దిగుమతుల మధ్య వ్యత్యాసం 9.37 బిలియన్ డాలర్లుగా ఉంది. దేశంలో ఎగుమతులకంటే దిగుమతులు అధికంగా ఉన్నాయి.

వాణిజ్య లోటు 9.37 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ వివరాలను గురువారం వాణిజ్యమంత్రిత్వ శాఖ వెలువరించింది. ఇక వీటిలో ముఖ్యమైన వాటిని గమనిస్తే.. పెట్రోలియం ప్రోడక్టులు, రత్నాలు, ఆభరణాలు, రసాయనాలతోపాటు తోలు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా పెరిగాయి.

ఇక దిగుమతుల్లో చమురు అధికంగా ఉంది. కేవలం చమురు కోసమే దేశం 10.68 బిలియన్ డాలర్లు చెల్లింది. 2020 జూన్తో పోల్చితే ఇది 116.51 శాతం అధికం, కాగా గతేడాది జూన్ లో ఈ చెల్లింపులు 4.93 బిలియన్స్ గా ఉంది. బంగారం దిగుమతులు 60 శాతం పెరిగి 9.6 బిలియన్ డాలర్లకు చేరాయి.

2021-22 ఏప్రిల్‌-జూన్‌ మధ్య ఎగుమతుల విలువ 86 శాతం పెరిగి 95.39 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. దిగుమతులు 126.15 బిలియన్‌ డాలర్లకు ఎగసింది. ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరగడంతో 30.75 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *