టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనడం అంత సులభం కాదు. పైగా చాలా మందిలో కొందరికి మాత్రమే అవకాశం దక్కుతుంది. అయితే ఈరోజు మనం మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి టోక్యో ఒలింపిక్స్ లో సత్తా చాటుకుంటున్న తెలుగు క్రీడాకారులు గురించి చూద్దాం. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి.
టోక్యో ఒలింపిక్స్ | Tokyo Olympics
టోక్యో ఒలింపిక్స్ లో తెలంగాణ క్రీడాకారులు:
టోక్యో ఒలింపిక్స్ లో తెలంగాణ నుండి ఇద్దరు క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. వాళ్ళల్లో ఒకరు సానియా మీర్జా. మిక్స్డ్ డబుల్స్ టెన్నిస్ లో నాల్గవసారి ఒలింపిక్స్ లో పాల్గొనడం జరుగుతోంది. అలానే టోక్యో ఒలింపిక్స్ లో తెలంగాణ నుండి సాయి ప్రణీత్ కి కూడా అవకాశం దక్కింది. సాయి ప్రణీత్ మొట్టమొదటిసారి భారత దేశం తరుపున మెన్ సింగిల్స్ బాడ్మింటన్ లో పాల్గొనున్నారు.
టోక్యో ఒలింపిక్స్ లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు:
ఆంధ్ర నుండి టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనున్న క్రీడాకారుల గురించి చూస్తే.. గత సంవత్సరం ఒలింపిక్స్ జరిగినప్పుడు సంబరాలు జరుపుకోవడం జరిగింది.. దానికి గల కారణం పీవీ సింధు. ఉమెన్స్ సింగిల్స్ బాడ్మింటన్ లో పీవీ సింధు రజత పతాకాన్ని పొందింది.
దీనితో పీవీ సింధు ఒలింపిక్స్ లో మొట్టమొదటి రజత పతాకాన్ని పొందిన మహిళగా రికార్డ్ సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె ఉమెన్స్ సింగిల్స్‌లో పోటీ చేయనుండగా, మెన్స్ డబుల్స్ లో సాత్విక్‌సైరాజ్ రాంకిరెడ్డి పాల్గొంటారు.