మీరు కొత్తగా బైక్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ప్రముఖ వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో టూవీలర్ కొనుగోలుదారులకు తీపికబురు అందించింది. కేటీఎం 250 అడ్వెంచర్ బైక్ ధరను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఈ బైక్ ధరను రూ.25 వేల వరకు తగ్గించేసింది. అయతే ఈ తగ్గింపు కొంత కాలమే ఉంటుంది. అంటే ఆగస్ట్ నెల చివరి వరకు మాత్రమే తగ్గింపు ప్రయోజనం అందుబాటులో ఉంటుందని కంపెనీ వివరించింది. టూవీలర్ అమ్మకాలను పెంచుకోవాలనే లక్ష్యంతో బజాజ్ కంపెనీ ఈ మేరకు తాత్కాలికంగా ధరను తగ్గించేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ బైక్ ధర రూ.2.3 లక్షలకు దిగివచ్చింది. ఇకపోతే ఈ బైక్‌లో 250 సీసీ ఇంజిన్ ఉంటుంది.