యాపిల్ ఐఫోన్ 18 సిరీస్ వచ్చేస్తోందోచ్: 12GB ర్యామ్‌తో హై పర్ఫార్మెన్స్!

యాపిల్ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ ఐఫోన్ 18 లైనప్ సెప్టెంబర్ 2026లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని దక్షిణ కొరియా నివేదికలు సూచిస్తున్నాయి. ఈ సిరీస్‌లో కీలకమైన అప్‌గ్రేడ్ ఏమిటంటే, కొత్త మోడల్స్ ప్రస్తుత ఐఫోన్ 17 సిరీస్ కంటే 50 శాతం వరకు హై మెమరీని కలిగి ఉండొచ్చు. ప్రస్తుతం ఐఫోన్ 17 ప్రో మోడళ్లు 12GB ర్యామ్‌తో వస్తుండగా, స్టాండర్డ్ ఐఫోన్ 17 మోడల్ 8GB ర్యామ్‌తో ఉంది. అయితే, రాబోయే ఐఫోన్ 18 సిరీస్‌లో బేస్ మోడల్ ఐఫోన్ 18 కూడా 12GB ర్యామ్ పొందవచ్చని సమాచారం.

నివేదికల ప్రకారం, యాపిల్ కంపెనీ రాబోయే అన్ని ఐఫోన్ 18 మోడళ్లలో ఒకే రకమైన మెమరీని తీసుకురావాలని యోచిస్తోంది. దీని కోసం, కంపెనీ 12GB మరియు 16GB కాన్ఫిగరేషన్‌లలో హై పర్ఫార్మెన్స్ అందించే LPDDR5X మెమరీ చిప్‌ల కోసం శాంసంగ్‌తో పాటు SK హైనిక్స్, మైక్రాన్‌లతో కూడా చర్చలు జరుపుతోంది. ఈ భారీ మెమరీ అప్‌గ్రేడ్ వలన ఫోన్ స్పీడ్ పర్ఫార్మెన్స్ మెరుగుపడి, ఆకర్షణీయమైన ఆన్-డివైస్ ఏఐ (AI) ఫీచర్లను అందించడానికి వీలు కలుగుతుందని భావిస్తున్నారు. ఐఫోన్ 18 ప్రో మోడళ్లకు నెక్స్ట్ జనరేషన్ A20 ప్రో చిప్, రెగ్యులర్ ఐఫోన్ 18లో A20 చిప్ (రెండూ 2nm ప్రాసెస్‌లో) ఉండవచ్చు.

డిజైన్ పరంగా ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ ప్రో మాక్స్, ఐఫోన్ 17 ప్రో సిరీస్ మాదిరిగానే ఒకే సైజులు, అల్యూమినియం యూనిబాడీ డిజైన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే, స్టాండర్డ్ ఐఫోన్ 18 చిన్న డైనమిక్ ఐలాండ్‌తో రావచ్చు. కెమెరా విభాగంలో కూడా అప్‌గ్రేడ్‌లు ఉండొచ్చు, ఐఫోన్ 18లో 48MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉండవచ్చు. ధరల విషయానికొస్తే, ఐఫోన్ 17 సిరీస్ ధర మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. బేస్ మోడల్‌కు దాదాపు ₹82,900 నుంచి, ప్రో వెర్షన్‌కు ₹1,34,900 నుంచి ప్రారంభం కావచ్చని అంచనా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *