పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు (అక్టోబర్ 23) సందర్భంగా అభిమానులకు గిఫ్ట్‌గా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా టైటిల్ టీజ్ పోస్టర్ విడుదలైంది. స్టైలిష్ సూట్‌లో, బ్రీఫ్‌కేస్ పట్టుకుని, బ్రిటిష్ జెండాతో కప్పబడిన నేలపై ప్రభాస్ నడుస్తున్న లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్టర్‌లో “1932 నుండి మోస్ట్ వాంటెడ్”, “ఒంటరిగా నడిచే ఒక బెటాలియన్” అనే లైన్స్ ఉండటం సినిమా టైమ్‌లైన్, కాన్సెప్ట్‌పై భారీ అంచనాలను పెంచాయి.
ఇన్నాళ్లు ‘ప్రభాస్ హను’ అనే వర్కింగ్ టైటిల్‌తో పిలవబడుతున్న ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ టైటిల్‌ను గురువారం (అక్టోబర్ 23) ఉదయం 11.07 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. ఈ చిత్రానికి సంబంధించిన ‘పాండవుల పక్షాన ఉన్న కర్ణుడు’ అనే క్యాప్షన్, ట్యాగ్‌లైన్‌లు చూస్తుంటే, ఇది స్వాతంత్ర్యం రాకముందు నాటి (ప్రీ-ఇండిపెండెన్స్) నేపథ్యంలో, తిరుగుబాటు స్వభావం ఉన్న ఓ పాత్ర కథాంశంతో ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ లైనప్‌లో ‘రాజాసాబ్’, ‘స్పిరిట్’, ‘కల్కి 2’, ‘సలార్ 2’ వంటి భారీ బడ్జెట్ సినిమాలు ఉండగా, హను రాఘవపూడితో చేస్తున్న ఈ సినిమా మరో క్రేజీ ప్రాజెక్టుగా మారబోతోంది. అయితే, మారుతి దర్శకత్వంలో సంక్రాంతికి విడుదల కానున్న ‘ది రాజా సాబ్’ చిత్రం నుంచి కూడా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఏదైనా అప్‌డేట్ వస్తుందేమోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ బర్త్‌డేను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిపేందుకు అభిమానులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.