ఉత్తరప్రదేశ్‌లో చెల్లిని పెళ్లి చేసుకోనందుకు మరియు వదినతో సంబంధం కొనసాగించడానికి నిరాకరించినందుకు మరిదిపై దాడి చేసి ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన రెండు దారుణ సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆగ్రా పరిధిలోని బర్హన్ ఏరియాలో, ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యోగేష్ అనే యువకుడు, దీపావళి సెలవులకు ఇంటికి వచ్చాడు. తన సోదరి (వదిన) చెల్లిని కాకుండా వేరొక యువతితో నిశ్చయం చేసుకున్నందుకు అతని సోదరి (వదిన) అర్చన తీవ్ర కోపంతో యోగేష్‌పై దాడికి పాల్పడింది. వెంటనే ఆమె కత్తితో దాడి చేసి అతడి ప్రైవేట్ పార్ట్‌ను కట్ చేసింది. నొప్పితో విలవిల్లాడిన యోగేష్‌ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మరో దారుణ ఘటన ప్రయాగ్‌రాజ్‌లో చోటుచేసుకుంది. ఉమేష్ (20) అనే యువకుడు గతంలో తన వదిన మంజుతో రిలేషన్లో ఉంటున్నాడు. అయితే, ఉమేష్ వదిన చెల్లెలు కాకుండా వేరొకరితో పెళ్లి బంధం ఏర్పాటు చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వదిన మంజు కోపంతో ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఉమేష్ నిద్రిస్తున్న సమయంలో మంజు అతడిపై దాడి చేసి, అతని ప్రైవేట్ పార్ట్‌ను కత్తితో కట్ చేసింది.
తీవ్ర గాయాలతో ఉమేష్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ, పూర్తి కోలుకోవడానికి నెలలు పట్టే అవకాశం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన మంజు ఇప్పటికే గర్భవతి అని పోలీసులు తెలిపారు. ఈ రెండు సంఘటనలు ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపగా, పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.