ఈ నెల 17వ తేదీన నిర్వహించాల్సిన తన కుమారుడు, నటుడు నిఖిల్ వివాహం అదే సమయానికి జరుగుతుందని, కానీ మొదట చెప్పినట్లు అంగరంగ వైభవంగా కాదని మాజీ సీఎం. హెచ్.డి.కుమారస్వామి అన్నారు. మంగళవారం తమ కుమారుడు నిఖిల్ వివాహం విషయమై ఆయన మాట్లాడుతూ అనుకున్న ప్రకారం ఈ నెల 17వ తేదీన ఈ వివాహం జరుగుతుంది. వధూవరుల కుటుంబాల నుంచి కేవలం 15–20 మంది మాత్రం హాజరవుతారు. బెంగళూరులో మా ఇంటిలోనే పెళ్లి జరుగుతుంది అని తెలిపారు.