యూత్ సెన్సేషన్ ‘డ్యూడ్

యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన లేటెస్ట్ దీపావళి బ్లాస్ట్ చిత్రం ‘డ్యూడ్’ తెలుగులో అద్భుతమైన రెస్పాన్స్‌తో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి హౌస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ‘డ్యూడ్ దివాళి బ్లాస్ట్’ ప్రెస్ మీట్ నిర్వహించారు. హీరో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ, తన గత చిత్రాలైన ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ల కంటే నాలుగైదు రెట్లు ఎక్కువ కలెక్షన్స్ ‘డ్యూడ్’ చేసిందని నిర్మాతలు చెప్పడం ఆనందంగా ఉందని తెలిపారు. తెలుగు ప్రేక్షకులు తనను యాక్సెప్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.

నిర్మాత నవీన్ యర్నేని మాట్లాడుతూ, ‘డ్యూడ్’ విజయం తమకు మంచి దీపావళి గిఫ్ట్ అని సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రం ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 22 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని వెల్లడించారు. ఇది దివాళి బిగ్ విన్నర్ అని, అన్ని చోట్ల నుంచి అద్భుతమైన నెంబర్స్ వస్తున్నాయని తెలిపారు. మరో నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ, ఈ చిత్రం జెన్‌జీ కాన్సెప్ట్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్‌ను బ్లెండ్ చేసి ఒక కొత్త జోనర్ ఫీలింగ్‌ను క్రియేట్ చేసిందని, సినిమాలో 20 ఎక్స్‌ట్రార్డినరీ బ్లాక్స్ ఉన్నాయని తెలిపారు.

మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, ‘డ్యూడ్’ తెలుగులో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందని, ప్రదీప్ రంగనాథన్‌ను తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఓన్ చేసుకున్నారని అన్నారు. ఈ సినిమాకు చాలా పెద్ద రన్ ఉండబోతుందని, సెకండ్ షో నుంచే రిపీట్ ఆడియన్స్ ఉన్నారని తెలిపారు. ఇంత అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అందరూ ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలని మేకర్స్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *