కాలుష్య నియంత్రణ అప్పీలెట్ అథారిటీ ఏర్పాటుపై హైకోర్టులో విచారణ జరిగింది.అథారిటీ ఛైర్మన్ నియామక ప్రక్రియ జరుగుతోందని ఏజీ తెలిపారు. నియామకానికి సంబంధించిన ఫైల్ ప్రస్తుతం ఎక్కడ పెండింగ్‌లో ఉందని హైకోర్టు పేర్కొంది. ఈనెల 5న సీఎం వద్దకు ఫైల్ పంపించినట్లు ఏజీ తెలిపారు. 2 వారాల్లో అప్పీలెట్ అథారిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే రెండు సార్లు గడువు ఇచ్చామని.. ఇదే చివరి అవకాశమని హైకోర్టు పేర్కొంది. నోటిఫికేషన్ ఇవ్వకపోతే పర్యావరణ శాఖ కార్యదర్శి హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. విచారణ ఆగస్టు 4కి కోర్టు వాయిదా వేసింది.