సీఎం కేసీఆర్‌పై మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితులను కేసీఆర్ మోసం చేశారని ధ్వజమెత్తారు. దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేసేవరకు ప్రభుత్వాన్ని వెంటాడుతామని హెచ్చరించారు. టీఆర్ఎస్‌లో ఉన్న దళిత ఎమ్మెల్యేలు నోరులేని మూగజీవాలని విమర్శించారు. దళిత ఎమ్మెల్యేలలో ఒకరిని మంత్రిని చేయాలని డిమాండ్ చేశారు. కొప్పుల ఈశ్వర్‌ను ఉపముఖ్యమంత్రిని చేయాలని మందకృష్ణమాదిగ కోరారు.