యంగ్ స్టార్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ నటించిన తాజా సినిమా ‘తెలుసు కదా’ ప్రీమియర్ షోల విషయంలో కొత్త ట్రెండ్‌ను అనుసరిస్తోంది. సాధారణంగా ఇండియా కంటే ముందుగా అమెరికాలో ప్రీమియర్స్ పడటం జరుగుతుంటుంది. కానీ, ఈ సినిమాకు సంబంధించి ఇండియాలోనే ఫస్ట్ షో పడనుంది. గురువారం (అక్టోబర్ 16వ తేదీ) రాత్రి హైదరాబాద్ సిటీలోని ఏఎంబీ మల్టీప్లెక్స్‌లో చిత్ర బృందం, సెలబ్రిటీల కోసం ఈ స్పెషల్ షోను ఏర్పాటు చేశారు. అమెరికాలో ఫస్ట్ షో (ఇండియన్ టైమింగ్ ప్రకారం అక్టోబర్ 17వ తేదీ ఎర్లీ మార్నింగ్ $3.30$ గంటలకు) కంటే ముందే ఈ షో పడుతోంది.
ఏఎంబీలో షో రాత్రి $7.30$ గంటలకు ప్రారంభం కానుండగా, సినిమా రన్ టైమ్ $2.16$ గంటలు. ఇంటర్వెల్ సమయాన్ని కలుపుకొని సినిమా పూర్తి అయ్యేసరికి సుమారు రెండున్నర గంటలు పడుతుంది. కాబట్టి, గురువారం (అక్టోబర్ 16వ తేదీ) రాత్రి పది గంటలకు ఈ సినిమా రిజల్ట్ ఏమిటి అనేది తెలిసే అవకాశం ఉంది. ‘తెలుసు కదా’ ట్విట్టర్ రివ్యూలతో పాటు ప్రీమియర్స్ రిపోర్ట్ కూడా నేడు రాత్రికే వచ్చేస్తాయని సమాచారం.
‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ వంటి విజయాల తర్వాత సిద్ధూకి ‘జాక్’ సినిమా షాక్ ఇవ్వడంతో, ‘తెలుసు కదా’ విజయం అతడి కెరీర్‌కు కీలకంగా మారింది. ఈ చిత్రంతో ప్రముఖ స్టైలిస్ట్, రైటర్ కోన వెంకట్ కజిన్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో సిద్ధూ సరసన రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. తమన్ సంగీతం అందించిన ‘మల్లిక గంధ’ పాట ఇప్పటికే చార్ట్ బస్టర్ అయింది.