కేంద్రమంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతల భేటీ

కేంద్రమంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతల భేటీ ముగిసింది. అనంతరం తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ మాజీమంత్రి ఈటల రాజేందర్ పార్టీలో చేరిన రోజే అమిత్‌షాను కలవాలనుకున్నామని తెలిపారు. ఈటల ఎన్నికల్లో గెలుస్తారనే సర్వే రిపోర్ట్స్ వచ్చాయని వెల్లడించారు. క్విట్ ఇండియా దినోత్సవం రోజు భాగ్యలక్ష్మి గుడి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తామని సంజయ్ ప్రకటించారు. బీజేపీ బహిరంగ సభకు అమిత్ షా వస్తామన్నారని తెలిపారు. ఆగస్టు 9న పాదయాత్ర మొదలవుతుందన్నారు. టీఆర్‌ఎస్‌ భయపడుతోంది, వారికి అభ్యర్థి దొరకడం లేదని సంజయ్‌ ఎద్దేవాచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *