కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం నాడు శ్రీశైలం చేరుకున్నారు. తొలుత ఆయన భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయ పద్ధతిలో పూర్ణకుంభంతో ప్రధానికి స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో వేదమంత్రాల నడుమ పూజ కార్యక్రమం జరిగింది. ఈ పర్యటనలో ప్రధాని వెంట ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వారు ముగ్గురూ కలిసి దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రధాని మోదీ స్వయంగా పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. మల్లికార్జున స్వామిని ఆరాధించిన అనంతరం, భ్రమరాంబ అమ్మవారికి నిర్వహించిన ఖడ్గమాల, కుంకుమార్చన పూజల్లో పాల్గొన్నారు. మొత్తం $50$ నిమిషాలపాటు మోదీ ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణంలో గడిపారు. ఈ కార్యక్రమాల అనంతరం, ఆలయ అధికారులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.
శ్రీశైలం దర్శనం ముగించుకున్న తర్వాత, ప్రధాని మోదీ కర్నూలు జిల్లాలోని నన్నూరులో నిర్వహించిన “సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభకు ముందు మల్లన్న దర్శనం చేసుకోవడం ప్రధాని పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు.