రంగారెడ్డి జిల్లా పరిదిలోని ఇమ్మరత్ కాంచె గ్రామంలోనిసర్వేనెంబర్1/1లో ప్రభుత్వం అత్యాధునిక మెగా డెయిరీ నిర్మాణానికి సన్నాహాలుచేస్తోందని తెలంగాణ డెయిరీ కార్పొరేషన్ ఛైర్మన్ లోకభూమారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెగా డెయిరీ నిర్మాణం కోసం ప్రభుత్వం విజయ డెయిరీకి 40 ఎకరాల స్థలాన్నిలీజుకు ఇచ్చింది. ఈ మెగా డెయిరీ నిర్మాణానికి సంబంధించి నాబార్డ్ 144.50కోట్ల రూపాయల రుణాన్నిఇప్పటికే మంజూరుచేసింది. మొత్తం 246.50కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటి వరకూ జీవో నెం.20 అడ్డంకిగా ఉందని ఛైర్మన్ భూమారెడ్డి తెలిపారు.
అయితే ఔటర్ రింగ్‌రోడ్ పరిధిలో విజయ డెయిరీ నిర్మాణానికి జీవో 20 నుంచి మినహాయింపు ఇస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దస్త్రం పై ఆమోదం తెలిపారు. దీంతో మెగా డెయిరీ నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయని ఆయన చెప్పారు. త్వరలో మెగా డెయిరీ నిర్మాణానికి శంకుస్ధాపన , భూమి పూజ కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈసందర్బంగా ప్రభుత్వ అనుమతులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు భూమారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.