కర్నూలు జిల్లా నన్నూరులో జరిగిన “సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ, “ఎలాంటి ఫలితం ఆశించకుండా దేశ సేవే పరమావధిగా పని చేస్తున్న కర్మ యోగి ప్రధాని మోదీ,” అని అభివర్ణించారు. మోదీ తన దేశ సేవతో ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలిచారని పవన్ కొనియాడారు. ఈ సభలో ప్రధాని మోదీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.
ప్రధాని మోదీ తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలను పవన్ కల్యాణ్ ప్రశంసించారు. దేశంలో పన్నుల భారం పెరగడమే తప్ప తగ్గలేదని గుర్తు చేస్తూ, ఈ సంస్కరణలతో పేదలు, సామాన్యులకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుందన్నారు. జీఎస్టీ 2.0తో ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ. 20 వేల వరకు ఆదా అవుతుందని, విద్యా, వైద్యం ఖర్చుల భారం నుంచి ప్రజలకు ఊరట లభిస్తుందని వివరించారు. ఆత్మ నిర్భర భారత్ ద్వారా దేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన ఘనత ప్రధాని మోదీదే అని ఆయన కొనియాడారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మరో ఏళ్లు అధికారంలో ఉండాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. దీని కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, తట్టుకొని నిలబడతామని, ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో అందరం సమిష్టిగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ సభ ద్వారా రాష్ట్రంలో రూ. వేల కోట్లకు మించి అభివృద్ధి పనులకు ప్రారంభం చేశారని, ఓర్వకల్లు పారిశ్రామిక ప్రాంతంలోనే రూ. వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని ఆయన వెల్లడించారు.