రాజ్యసభలో లీడర్ ఆఫ్ ద హౌజ్‌గా పియూష్ గోయల్‌

Piyush Goyal ఈ నెల 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో..రాజ్యసభలో లీడర్ ఆఫ్ ద హౌజ్‌గా పియూష్ గోయల్‌ ని బుధవారం బీజేపీ ప్రకటించింది. ఇప్పటివరకు రాజ్యసభలో లీడర్ ఆఫ్ ద హౌజ్‌గా ఉన్న థావర్‌చంద్ గెహ్లాట్‌ను కర్ణాటక గవర్నర్‌గా ఇటీవల కేంద్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.

దీంతో రాజ్యసభలో ఖాళీ అయిన ఆ కీలకమైన బాధ్యతలను కేంద్రప్రభుత్వంలో కీలక మంత్రిత్వశాఖలను నిర్వహిస్తున్న మరియు 2010 నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పియూష్ గోయల్‌కు బీజేపీ అప్పగించింది. గత రెండేళ్లుగా గోయల్ చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. రాజ్యసభలో వివిధ బిల్లులకు మద్దుతు విషయంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోని ప్రతిపక్ష పార్టీలు బీజేడీ, ఏఐఏడీఎంకే, వైఎస్‌ఆర్‌సిపి వంటి ప్రతిపక్ష పార్టీలతో చర్చలు జరిపి బీజేపీకి మద్దతిచ్చేలా చేయడంలో గోయల్ చురుకైన పాత్ర పోషించారు. ప్రస్తుతం పియూష్ గోయల్.. కేంద్ర జౌళిశాఖ మరియు వాణిజ్య మరియు పరిశ్రమలు మరియు ఆహార,ప్రజా సరఫరాల శాఖలకి మంత్రిగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *