గతంలో ట్రోలింగ్‌కు గురైన కిరణ్ అబ్బవరం, ‘క’ సినిమాతో భారీ విజయాన్ని అందుకుని తన రేంజ్‌ను పెంచుకున్నారు. ఈ సినిమా రూ.50 కోట్లు కొల్లగొట్టి, విమర్శకుల నోళ్లు మూయించింది. ఆ తర్వాత వచ్చిన ‘దిల్రూబా’ కమర్షియల్‌గా పెద్దగా ఆడకపోయినా, ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘K-ర్యాంప్’ సినిమాపై మాత్రం యూత్‌లో మంచి బజ్ నెలకొంది. ఈ చిత్రం ద్వారా కిరణ్ అబ్బవరం మరోసారి మాస్, యాక్షన్, ఎమోషన్‌తో కూడిన పాత్రలో కనిపించనున్నారు.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్లు ఆడియెన్స్‌లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా, ఈ సినిమా రన్ టైమ్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 20 నిమిషాలు లాక్ అయినట్లు వెల్లడించారు. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్లో సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ దండా, శివ బొమ్మ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తూ, కథ, స్క్రీన్‌ప్లే బాధ్యతలను కూడా స్వయంగా చేపట్టారు. కిరణ్ అబ్బవరం సరసన గ్లామరస్ బ్యూటీ యుక్తి తరేజా కథానాయికగా నటిస్తోంది. డీవోపీగా సతీష్ రెడ్డి మాసం, ఎడిటర్‌గా ఛోటా కె ప్రసాద్, మ్యూజిక్‌ను చేతన్ భరద్వాజ్ అందిస్తున్నారు. కిరణ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మాస్, యాక్షన్, థ్రిల్ మిక్స్ చేయనున్నారని ఇండస్ట్రీ టాక్.