‘కల్కి 2’కి హీరోయిన్‌ దొరికేసింది..? ఎవరంటే..!

ప్రస్తుత పాన్‌ ఇండియా మోస్ట్‌ అవైయిటెడ్‌ చిత్రాల్లో ‘కల్కి 2′ ఒక్కటి. ఫస్ట్‌ పార్ట్‌ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమా చూసి ఆడియన్స్‌ అంత ఫుల్‌ థ్రిల్లర్‌ అయ్యారు. నాగ్‌ అశ్విన్‌ విజన్‌కి దర్శక దిగ్గజాలు సైతం ఫిదా అయ్యారు. ‘కల్కి 2898 ఏడీ‘ రిలీజ్‌ తర్వాత అంత నాగ్‌ అశ్విన్‌ పనితీరుని కొనియాడారు. దీంతో పార్ట్‌ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కల్కి 2′ ఎప్పుడెప్పుడు సెట్స్‌పైకి వస్తుందా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ టీం షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ చిత్రం నుంచి దీపికా పదుకొనెను తొలగించినట్టు ప్రకటన ఇచ్చారు.

 

హాట్ టాపిక్ కల్కి 2 హీరోయిన్

అప్పటి నుంచి ఈ అంశం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. దీపికాను తొలగించారు సరే.. మరి ఆమె స్థానంలో ఎవరిని పెడుతున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ విషయంలో మూవీ టీం, ఫ్యాన్స్‌ తీవ్ర ఆలోచనలో పడ్డారు. దీపికాను రీప్లేస్‌ చేయాలంటే అదే రేంజ్ క్రేజ్, ఫేం ఉన్న నటిని తీసుకురావాలి. ఇక దీపికాను రీప్లేస్‌ చేయాలంటే ఏ నటి అయితే బాగుంటుందనేది నెట్టింట తరచూ చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో తరచూ పలువురు హీరోయిన్లు పేర్లు సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఆలియా భట్‌ టాప్‌లో నిలిచింది.

 

దీపికా ప్లేస్ ఆలియా భట్

‘కల్కి 2′ దీపికా స్థానంలో ఆలియా భట్‌ని తీసుకుంటే పర్ఫెక్ట్‌ మ్యాచ్‌ అంటూ నెటిజన్స్‌, ఫ్యాన్స్‌ నుంచి డిమాండ్స్‌ వస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె పేరు టాప్‌లో నిలిచింది. నెటిజన్స్, ఫ్యాన్స్‌ నుంచి వస్తున్న డిమాండ్స్‌ మేరకు మూవీ టీం కూడా ఆలియా భట్‌ పేరును పరిశీస్తుందట. దీపికా స్థానంలో‌ ఆలియాను తీసుకునేందుకు కల్కి 2 టీం ఎక్కువ ఆసక్తిని కనబరుస్తుందట. ఈ మేరకు దర్శక–నిర్మాతలు, హీరో ఈ విషయమై చర్చిస్తున్నారట. అయితే ఆలియాను తీసుకోవడం ఒకే.. కానీ, ఈ పాత్రకు ఆప్ట్ అవుతుందా? లేదా? అనేది కల్కి టీంకు ముందున్న పెద్ద సవాలు.

 

దీపికాని మైపరించగలదా

అయితే, కల్కిలో దీపికాది కీలక రోల్‌ అనే విషయం తెలిసింది. మూవీలో ప్రభాస్‌, అమితాబ్‌ హీరోలైనప్పటికీ.. కథ మొత్తం దీపికా చూట్టూనే తిరుగుతుంది. ఆమె పాత్రే ఈ కథకు ప్రధాన బలం. కల్కికి జన్మనిచ్చే ప్రెగ్నెంట్‌ ఉమెన్ గా అమ్మ పాత్రలో దీపికా ఒదిగిపోయింది. ఇప్పుడు ఆమెను తీసేయడంతో మళ్లీ ఆ పాత్రలో నటించే నటి.. ఆడియన్స్‌ని ఆప్ట్‌ చేసుకునేలా ఉండాలి.దీపికా తర్వాత ఆ స్థానాన్ని భర్తి చేసే నటి ఎవరైనా ఉన్నారంటే అది ఆలియా భట్‌ అంటూ ఆడియన్స్‌, ఫ్యాన్స్‌ నుంచి రివ్యూలు వస్తున్నాయి. దీంతో కల్కి 2లో దీపికా రీప్లేస్‌ చేసే నటిమణుల్లో ఆలియా భట్‌ పేరు బాగా వినిపిస్తుంది. మరి మూవీ టీం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *