సర్వజనాస్పత్రిలోని ఐసోలేషన్, క్వారంటైన్ వార్డుల్లో ఉన్న కోవిడ్ అనుమానితుల్లో కొందరు ఓవరాక్షన్ చేస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నా.. వార్డుల నుంచి బయటకు వచ్చి విహరిస్తున్నారు. దీంతో ఆస్పత్రిలోని స్టాఫ్‌నర్సులు, కింది స్థాయి సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. హిందూపురం ప్రాంతానికి చెందిన కరోనా పాజిటివ్ కేసుల్లోని వారే ఆస్పత్రిలో అలజడి సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా పాజిటివ్ వచ్చిన వారు ఐసోలేషన్ గదుల నుంచి బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి వర్గాలు కోరుతున్నాయి.