తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..! మరో రెండు దగ్గు మందులు బ్యాన్..

చిన్నారులలో తీవ్రమైన రోగాల్ని, మరణాలను కలిగిస్తున్న ఈ ప్రమాదకర దగ్గు మందులను రాష్ట్ర ప్రభుత్వం నిషేధిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

రీలైఫ్, రెస్పీఫ్రెష్-టీఆర్ అనే రెండు సిరిప్ లను విక్రియించకూడదని.. తెలంగాణ సర్కార్ అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం పిల్లల భద్రతను ముఖ్యంగా పరిగణించి తీసుకోవడం జరిగింది.

 

ఉపశమనానికి వేసిన దగ్గు మందు చిన్నారుల ప్రాణం తీసింది. మధ్య ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో దగ్గుమందు మరణాలతో కేంద్రం అలర్ట్ అయ్యింది. ఒక ఫార్మా సంస్థకు చెందిన సిరప్ లపై నిషేదాన్ని విధించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో దగ్గు మందు పంపిణీని నిలిపివేసింది. రెండేళ్లలోపు పిల్లలకి కాఫ్ సిరప్ వాడొద్దని డీజీహెచ్ఎస్ ఎడ్వైజర్ ఇచ్చింది.

 

చిన్నపిల్లల్లో దగ్గు, జలుబు ట్రీట్మెంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని.. రకరకాల మందులు రాయడాన్ని నివారించాలని కేంద్రం సూచించింది. దగ్గుమందుతో సొంత వైద్యం చేయొద్దని ప్రజలకు సూచించింది. అన్ని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం అప్రమత్తం చేసింది. రాజస్థాన్ లో దగ్గుమందు వివాదం ఆరోగ్య వ్యవస్థల లోపాలను బయటపెట్టింది.

 

అలాగే కాంచీపురం Sresan Pharmaceutical తయారు చేసిన కోల్డ్ రిఫ్ సిరప్ పై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తనిఖీలు నిర్వహించింది. ఆ సిరప్ ను తక్షణం తెలంగాణలో విక్రయించకూడదని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో అన్ని హాస్పిటల్స్, ఫార్మసీలు ఈ నిషేదాన్ని వెంటనే అమలు చేయాలని సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *