చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి హీరో, హీరోయిన్ లుగా మారిన వారు ఎంతో మంది

చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి హీరో, హీరోయిన్ లుగా మారిన వారు ఎంతో మంది ఉన్నారు.ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఎంట్రీ ఇచ్చిన వారు ప్రస్తుతం స్టార్ హీరో, హీరోయిన్ లుగా సినీ ఇండస్ట్రీ ని ఏలుతున్నారు. మహేష్, ఎన్టీఆర్, తరుణ్, కళ్యాణ్ రామ్, బాలాదిత్య, తేజ సజ్జ, ఆకాష్ పూరి, ఇలా ఇంకా ఎంతో మంది ఉన్నారు. తాజాగా కావ్య ఈ లిస్టులో చేరుతోంది. కావ్య అంటే ఎవరు అని అనుకుంటున్నారా.కావ్య అంటే ఎవరో కాదండోయ్ అల్లు అర్జున్ హీరో గా నటించిన మొదటి సినిమా గంగోత్రి లో వల్లంకి పిట్ట అనే పాటలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కావ్య అంటే తొందరగా గుర్తు పట్టేస్తారు. అయితే చిన్నప్పుడు ఆ పాటలో ముద్దుముద్దుగా కనిపించినా ఆ ముద్దుగుమ్మ ఇప్పుడు ఏం చేస్తుందో ఎలా ఉందో తెలుసుకుందాం…

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటిసారిగా గంగోత్రి సినిమాలో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే తన మొదటి సినిమాలో వల్లంకి పిట్ట అనే పాట ప్రతి ఒక్కరికి గుర్తు ఉండే ఉంటుంది. ఈ పాటలో చిన్నప్పటి కథానాయికగా కనిపించినా కావ్య కళ్యాణ్ రామ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ పాటలో చిన్నారి చిన్నప్పుడు అల్లు అర్జున్ పాట పాడితే గానే తినదు. ఈ సినిమాలు ఆ చిన్నారి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంది హీరోల సినిమాలలో నటించింది. అడవి రాముడు, బాలు, అందమైన మనసులో సినిమాలలోనటించి చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కావ్య కళ్యాణ్ రామ్ పుణేలో లా పూర్తి చేసింది. ప్రస్తుతం సినిమాల వైపు మొగ్గు చూపుతోంది. ఒక్క తెలుగులో మాత్రమే కాకుండా తమిళం మలయాళం సినిమాలకు కూడా ఆడిషన్స్ ఇస్తోంది. ఈమెకు రియాలిటీకి దగ్గరగా ఉండే ఇంట్రెస్టింగ్ అలాగే ఛాలెంజింగ్ పాత్రలు అంటే ఎంతో ఇష్ట మట. కాకుండా అలాంటి పాత్రలు ఆమె కు వస్తే ఆసక్తిగా అనిపిస్తేనే చేస్తానని చెప్పుకొచ్చింది. ఈమె తెలుగమ్మాయి కావడం అడ్వాంటేజ్ గా ఫీల్ అవుతుందట.అంతేకాకుండా ఈమె నిత్యం సోషల్ మీడియా లో తనకు సంబంధించిన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది. కావ్య కళ్యాణ్ రామ్ ను చిన్నప్పుడు ఆ పాత్ర లో చూసి తరువాత ఇలా గ్లామరస్ గా చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *