స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత అల్లు అర్జున్ – బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రమిది. ఇందులో అల్లు అర్జున్ – రష్మిక జంటగా నటిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు. పుష్ప ఫస్ట్ పార్ట్ షూటింగ్ చివరి దశలో ఉంది. తాజా షెడ్యూల్ ను మంగళవారం ప్రారంభించారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపధ్యంలో సాగే ఈ కథలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా నటిస్తుంటే.. రష్మిక పల్లెటూరి అమ్మాయిగా నటిస్తోంది.

అయితే తాజాగా పుష్ప చిత్రం హిందీ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే కరణ్ జోహార్ దీనికి కీలక వ్యక్తి గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో తను తీసుకున్న పుష్ప తో నార్త్ లో కూడా కనక వర్షం కురవడం ఖాయం అంటూ సినీ విమర్శకులు అంటున్నారు. ఈ చిత్రం లో అల్లు అర్జున్ సరసన రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. ప్రముఖ మలయాళ నటుడు ఫాహద్ ఫాసిల్ ఈ చిత్రం లో విలన్ పాత్ర ను పోషిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *