అందమైన ప్రేమ కథతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా ఉప్పెన. మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఇది. ఈ సినిమాలో బెంగుళూరు బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. టాప్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. మంచి హిట్ అందుకోవడమే కాకుండా భారీగా వసూళ్లను కూడా రాబట్టింది. ఒక డెబ్యూ హీరో సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు రావడంతో టాలీవుడ్ మొత్తం షాక్ అయ్యింది.
అయితే ఈ చిత్రానికి వైష్ణవ్ తేజ్ మొదటి ఎంపిక కాదనేది తెలిసింది తక్కువ మందికే. దర్శకుడు బుచ్చిబాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండని బేస్ చేసుకొని కథ రాసుకున్నట్టు తెలియజేశాడు. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ రేంజ్ మారడంతో తన మనసు మార్చుకొని వైష్ణవ్‌ని సంప్రదించాడట బుచ్చి. అనూహ్యంగా ఉప్పెనతో తెరపైకి వచ్చిన వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే మంచి విజయం సాధించాడు