కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ అమలవుతున్న వేళ ప్రజలకు నిత్యావసరాలను అందుబాటులో ఉంచేందుకు పలు ఎఫ్‌ఎంసీజీ సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా ఆన్–డిమాండ్ ఈ–కామర్స్ ప్లాట్‌ఫాం డన్‌జోతో చేతులు కలిపినట్లు ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్ వెల్లడించింది. ఈ ఒప్పందం కింద డన్‌జో యాప్ ద్వారా వినియోగదారులు బ్రిటానియా ఉత్పత్తులను ఇంటి వద్దకే తెప్పించుకోవచ్చు. ఆర్డరు చేసిన గంటలోనే ఉత్పత్తులను అందించేలా చర్యలు తీసుకున్నట్లు ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఇందుకోసం బ్రిటానియా ఎసెన్షియల్స్ పేరిట బెంగళూరులో మంగళవారం తొలి స్టోర్ ప్రారంభించినట్లు బ్రిటానియా ఇండస్ట్రీస్ ఎండీ వరుణ్ బెర్రీ వివరించారు. త్వరలో హైదరాబాద్‌తో పాటు ముంబై, పుణే, ఢిల్లీ, గురుగ్రామ్, జైపూర్, చెన్నైలో కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. బిస్కట్లు, కేకులు, రస్కులు, మిల్క్‌షేక్‌లు, నెయ్యి, పాల పౌడరు, వేఫర్లు వంటి ఉత్పత్తులను బ్రిటానియా విక్రయిస్తోంది.