కొత్త సినిమాలో ముగ్గురమ్మాయిలతో ధనుష్‌ రొమాన్స్‌

కొత్త సినిమాలో ముగ్గురమ్మాయిలతో ధనుష్‌ రొమాన్స్‌ చేయనున్నారని చెన్నై కోడంబాక్కమ్‌ ఖబర్‌. ‘యారాద నీ మోహిని’, ‘ఉత్తమ పుథిరన్‌’ ఫేమ్‌ మిత్రన్‌ జవహర్‌ దర్శకత్వంలో ధనుష్‌ ఓ సినిమా చేయనున్నారు. అందులో హీరోయిన్లుగా హన్సిక, నిత్యా మీనన్‌, ప్రియ భవానీశంకర్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయట. అసలు విశేషం ఏంటంటే… ఈ సినిమాకు ధనుష్‌ కథ రాస్తున్నారట. అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది. ఈ ఏడాదే సినిమా సెట్స్‌కు వెళ్తుందని టాక్‌. ప్రస్తుతం తమిళంలో కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వంలో ధనుష్‌ ఓ సినిమా చేస్తున్నారు. అలాగే, అన్నయ్య సెల్వ రాఘవన్‌తో మరో సినిమా ఉంది. ఈ రెండూ పూర్తయ్యాక… మిత్రన్‌ జవహర్‌ సినిమా పట్టాలు ఎక్కుతుందా? లేదంటే తెలుగు దర్శకుడు శేఖర్‌ కమ్ములతో అంగీకరించిన పాన్‌ ఇండియా సినిమాను ముందు పట్టాలు ఎక్కించి, ఆ తర్వాత తమిళ సినిమా చేస్తారా? అనేది చూడాలి. శేఖర్‌ కమ్ములతో పాటు మరో తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాణంలో ధనుష్‌ సినిమా చేస్తారని సమాచారం. దానిని ఇంకా ప్రకటించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *