ఈ నెల 11న ఆదివారం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, దీని ప్రభావం రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో కనిపించనుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రాగల మూడు రోజులు మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. కోస్తా తీరం అల్లకల్లోలంగా ఉంటుందని, ఈదురుగాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని పేర్కొన్నారు.