ఫ్లిప్ కార్ట్‌లో ఆఫర్ల జాతర…

భారతదేశపు అగ్రగామి ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన ప్రతిష్టాత్మక ఫెస్టివల్ సేల్ అయిన ‘ది బిగ్ బిలియన్ డేస్ (TBBD) 2025’ తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఈ భారీ ఆఫర్ల ఉత్సవం సెప్టెంబర్ 23న ప్రారంభం కానుండగా, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మరియు బ్లాక్ సభ్యులకు సెప్టెంబర్ 22న ప్రత్యేక యాక్సెస్ లభించనుంది.

 

ఈ సందర్భంగా సెప్టెంబర్ 8న ప్రారంభమైన అర్లీ బర్డ్ డీల్స్ ఇప్పటికే వినియోగదారుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బ్యూటీ, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఆఫర్లు ఇప్పటికే ఊపందుకున్నాయి.

 

ఈ సంవత్సరం బిగ్ బిలియన్ డేస్ సేల్‌కు ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ అనే అత్యంత వేగవంతమైన డెలివరీ సేవ కూడా భాగస్వామ్యం కానుంది. దేశవ్యాప్తంగా 19 నగరాల్లోని 3వేల పిన్‌కోడ్‌లకు కేవలం 10 నిమిషాల్లో ఉత్పత్తులను డెలివరీ చేసేలా ఈ సేవను విస్తరించారు. వినియోగదారులకు స్మార్ట్‌ఫోన్లు, ఏఐ ఆధారిత ల్యాప్‌టాప్‌లు, 4కే టీవీలు, కొరియన్ బ్యూటీ బ్రాండ్స్ వంటి అనేక ప్రీమియం ఉత్పత్తులు అత్యంత తగ్గింపుతో అందుబాటులో ఉండనున్నాయి.

 

ఫ్లిప్‌కార్ట్ ఈ ఏడాది అభివృద్ధి చెందుతున్న నగరాలపై ప్రత్యేక దృష్టి సారించింది. షాప్సీ అనే తమ ప్లాట్‌ఫాం ద్వారా రూ.29 నుండి ప్రారంభమయ్యే డీల్స్, 100 శాతం సూపర్ కాయిన్ల రివార్డ్స్ వంటి ఆఫర్లను ప్రవేశపెట్టింది. వేగవంతమైన డెలివరీ అవసరాల్ని తీర్చేందుకు ఫ్లిప్‌కార్ట్ సప్లై చైన్ విభాగంలో 2.2 లక్షల ఉద్యోగాలు సృష్టించింది. అలాగే, దేశవ్యాప్తంగా 400 కొత్త మైక్రో ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

 

ఈ సేల్‌లో ఇతర బ్యాంకింగ్ భాగస్వామ్యాలు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐ, యూపీఐ డిస్కౌంట్లు వంటి ఎన్నో ఆకర్షణలు కూడా వినియోగదారులను ఆకట్టుకోనున్నాయి.

 

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025ను కేవలం షాపింగ్ సేల్‌గా కాకుండా, డిజిటల్ ఇండియాకు మార్గనిర్దేశకంగా ఉండే ఉత్సవంగా తీర్చిదిద్దేందుకు సన్నద్ధమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *