హైదరాబాద్: రాష్ట్రంలోని జూపార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి. కరోనా తగ్గుదలతో జూలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. వీటితోపాటు జింకల పార్కులు, జాతీయ ఉద్యానవనాలు కూడా తెరచుకోనున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ సందర్శకులను అనుమతించనున్నారు. దీంతో హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్క్ కూడా తిరిగి తెరుచుకోనుంది. ఉదయం 8.30 గంటలకు జూ పార్క్ను పునఃప్రారంభంకానుంది. అయితే సందర్శనకు వచ్చే వారికి పలు మార్గదర్శకాలను జూ అధికారులు విడుదల చేశారు. తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించారు.