కోవిడ్ ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు
► కోవిడ్ ఆసుపత్రుల్లో లక్ష్యాలకు అనుగుణంగా బెడ్లు ఏర్పాటు చేయాలి. 13 జిల్లాల్లోని కొవీఢ్ ఆస్పత్రుల్లో 8,950 బెడ్లకుగానూ 6,662 బెడ్లు.. 650 ఐసీయూ బెడ్లకు గానూ 334 సిద్ధంగా ఉన్నాయి. మిగిలినవి కూడా అతి త్వరలో ఏర్పాటు కావాలి.
► క్వారంటైన్లలో ముందు జాగ్రత్తగా మందులు అదనంగా అందుబాటులో ఉంచాలి. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ప్రకారం ఎక్కడా కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి.
► ఏప్రిల్ 7వ తేదీ ఉదయం నుంచి ఏప్రిల్ 8 వరకు మొత్తం 690 పరీక్షలు చేయగా, 25 పాజిటివ్‌గా వచ్చాయి. ఇవన్నీ దాదాపు ఢిల్లీ వెళ్లిన వారి కాంటాక్ట్ కేసులే.
► జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలతో బాధ పడుతున్న వారిలో హోం క్వారంటైన్‌లో ఉన్న 1,750 (బుధవారం సాయంత్రానికి 1752) మందిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగాలి.
అర్హులందరికీ సాయం అందాలి
► అర్హత ఉన్న వారికి రేషన్, రూ.1000 సహాయం కచ్చితంగా అందాలి. 1902కు వచ్చిన ప్రతికాల్‌ను ప్రత్యేకంగా పరిశీలించి సమస్య పరిష్కరించాలి.
► ఇప్పటి వరకు 1.36 కోట్ల కుటుంబాలకు ఉచితంగా రేషన్, 1.22 కోట్ల కుటుంబాలకు రూ.1,000 పంపిణీ చేశామని, మిగిలిన కటుంబాలకు పంపిణీ కొనసాగిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు.
► ప్రతిరోజూ అనంతపురం, కడప, ఇతర ప్రాంతాల నుంచి సుమారు 350 ట్రక్కుల వరకు అరటిని ఎగుమతి చేస్తున్నామని, ఇది కాక అదనంగా కొనుగోలు చేసి స్థానిక మార్కెట్లకు తరలిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. సుమారు 2 వేల మెట్రిక్ టన్నుల అరటిని ఎగుమతి చేశామని తెలిపారు.