“హిట్” సినిమా హిందీ రీమేక్‏

తెలుగులో నేచురల్ స్టార్ నాని నిర్మించిన, ఫలక్‌నుమా దాస్ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా నటించగా నటించిన “హిట్” సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రాన్ని ఇప్పుడు హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ రాజ్ కుమార్ రావు ఇందులో హీరోగా నటిస్తున్నారు. “మాతృక”కు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను హిట్ హిందీ రీమేక్‏తో బాలీవుడ్‏లోకి అడుగుపెడుతున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై దిల్ రాజు, భూషణ్ కుమార్, కిషన్ కుమార్, కుల్దీప్ రాథోడ్‏లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీలో ఈ చిత్రానికి మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

అమీర్ ఖాన్ దంగల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సన్యా మల్హోత్రా ఈ సినిమాలో హీరోయన్‏గా నటిస్తున్నారు. తెలుగులో రుహాని శర్మ పోషించిన పాత్రలో సన్యా నటించనుంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. #HIT టీమ్ లోకి సన్యా కు స్వాగతం” అని ట్వీట్ చేశారు మేకర్స్.

అలాగే హిట్ మూవీ తనకు చాలా నచ్చిందని.. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా నచ్చిందని.. అందుకే ఈ మూవీ ఆఫర్ రాగానే ఓకే చెప్పినట్లుగా సన్యా చెప్పుకోచ్చింది. హీరో రాజ్ కుమార్ రావు‏తో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందని.. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *