బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ మూవీని “బాయ్ కాట్” చేయాలంటూ నెటిజన్లు భారీ సంఖ్యలో రీట్వీట్లు

బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ మూవీని “బాయ్ కాట్” చేయాలంటూ నెటిజన్లు భారీ సంఖ్యలో రీట్వీట్లు చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. అందుకు కారణం పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), ప్రతిపాదిత నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి)పై కొనసాగుతున్న నిరసనలపై ఆయన చేసిన కామెంట్స్ అని అంటున్నారు. మరికొందరైతే ఈ హీరో సినిమా ద్వారా లవ్ జిహాద్ ను కూడా ప్రమోట్ చేస్తున్నాడని, బాలీవుడ్ హిందువులను టార్గెట్ చేస్తోందని ఆరోపిస్తున్నారు. మరోవైపు సుశాంత్ అభిమానులైతే సుశాంత్ లేనప్పుడు బాలీవుడ్ ఎందుకు ? బాలీవుడ్ ను బ్యాన్ చేస్తున్నామని అంటున్నారు. ఫర్హాన్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ “తూఫాన్”. రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆయనతో పాటు రితేశ్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మించారు. ‘భాగ్ మిల్కా భాగ్’ తర్వాత పర్హాన్, రాకేశ్ ఓంప్రకాశ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘తుఫాన్’పై భారీ అంచనాలే ఉన్నాయి. ముంబైలోని స్లమ్ ప్రాంతం డోంగ్రీ లో పుట్టి పెరిగిన ఓ అనాథ… బాక్సింగ్ ఛాంపియన్ గా ఎలా తయారయ్యాడన్నదే ఈ చిత్ర కథ.

పరేశ్ రావేల్ తో పాటు మృణాల్ ఠాకూర్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో ఫర్హాన్ బాక్సింగ్ రింగ్ లో బ్లూ కలర్ షర్ట్ తో, గ్లౌజులతో కన్పించాడు. అయితే ఈ పోస్టర్ విడుదలైనప్పటి నుంచి “బాయ్ కాట్ తూఫాన్” అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *